ఫేస్ బుక్ కొత్త రూల్స్

ఫేస్ బుక్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్నిఅమ్ముకుంటున్నాడని వచ్చిన ఆరోపణలతో ఇప్పుడు ప్రక్షాళన మొదలు పెట్టారు ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్.

ఇప్పుడు కొత్తగా 27 పేజీల పాలసీని విడుదల చేశారు. ప్రస్తుతం ఫేస్ బుక్ ఖాతాదారులు పెట్టే పోస్టులు సరైనవా, కావా అని చెక్ చేయడానికి 7,500 మంది కంటెంట్ వర్డ్ రైట్స్ ఉన్నారు. ఇకపై హేట్ స్పీచ్, సెక్సువల్, వైరల్స్ వంటి అన్ని అంశాలని లెక్కలోకి తీసుకుని ఖచ్చితంగా చెక్ చేస్తారు. ఏదైనా తేడాగా కన్పిస్తే ఆ పోస్టును డిలీట్ చేస్తారు. ఒకవేళ అలా ఎవరి పోస్ట్ అయినా డిలీట్ అయితే వారు ఫేస్ బుక్ ను రివ్యూ కోరవచ్చు. 24 గంటలలో రివ్యూను చూసి తన అభిప్రాయాన్ని చెబుతుంది ఫేస్ బుక్.

ఎవరైనా అదేపనిగా వివాదాస్పద పోస్టులు పెడితే ఆ అకౌంట్ ను శాశ్వతంగా డిలీట్ చేసే ఆప్షన్ కూడా ఈ కొత్త పాలసీలో ఉంది. ఇప్పటి నుంచి ఫేస్ బుక్ పోస్టులపై కఠినంగా వ్యవహరిస్తామని, ఇదంతా ప్రక్షాళనలో భాగమేనని చెప్పారు జుకర్ బర్గ్. అయితే ఇప్పటి నుంచి ఫేస్ బుక్ లో ఎలా పడితే అలా పోస్టులు పెట్టే అవకాశం లేదన్నమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *