telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జనసేన పగ్గాలు .. మాజీ జేడీకి.. సినిమాల్లోకి పవన్..

lakshminarayana away from janasena

జనసేన అధినేత పవన్ కళ్యాన్ సినిమాలతో బిజీ అవుతున్న నేపథ్యంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు కొత్త బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల ముందు అనేక తర్జన భర్జనల తరువాత మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. విశాఖ ఎంపీగా పోటీ చేసారు. ఆ తరువాత పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా లేరు. దీంతో..ఆయన జనసేన వీడుతారనే ప్రచారం సాగింది. కానీ, లక్ష్మీనారాయణ దీని పైన స్పష్టత ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తనను ఇక మీ సేవలు చాలు అనే వరకు పార్టీలోనే ఉంటానని స్పష్టం చేసారు. పవన్ నియమించిన పార్టీ పోలిట్ బ్యూరోలో…అదే విధంగా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలోనూ మాజీ జేడీకీ స్థానం దక్కలేదు. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న లక్ష్మీనారాయణ విశాఖ లాంగ్ మార్చ్ ఏర్పాట్లలో మాత్రం చురుగ్గా పాల్గొన్నారు. ఇదే సమయంలో పవన్ మాత్రం ఆయనను విశాఖ లో కొనసాగటానికి ఇష్టపడటం లేదు. ఆయనకు కొత్త బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. అందులో భాగంగా నేరుగా లక్ష్మీనారాయణకే ఆ విషయాన్ని స్పష్టం చేసారు.

విశాఖ నుండి జనసేన పార్టీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయన సేవలను మరో చోట వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు నాదెండ్ల మనోహర్ మినహా పార్టీ వాయిస్ బలంగా వినిపించే వారు పార్టీలో కరువయ్యారు. ఈ సమయంలో ప్రాంతాల వారీగా బలమైన వాయిస్ వినిపించే వారికి బాధ్యతలు అప్పగించాలని పవన్ భావిస్తున్నారు. అందులో భాగంగా..సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను విశాఖ లో కాకుండా..రాయలసీమలో వినియోగించుకోవాలని నిర్ణయించారు. దీంతో..ఆయనే స్వయంగా మాజీ జేడీకీ ఇదే విషయాన్ని స్పష్టం చేసారు. రాయలసీమలో పార్టీ తరపున బలంగా మాట్లాడే నాయకుల అవసరం ఉంది. ఆ ప్రాంతంపై దృష్టి పెట్టండి అని లక్ష్మీనారాయణకు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ సూచించారు.

Related posts