telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బుర్రకథ … విడుదలతేది ఖరారు..

Burra-Katha

డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘బుర్రకథ’. ఈ సినిమా మొదట జూన్ 28న విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ కారణాల వల్ల అది కాస్తా వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను జూలై 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ చిత్రంలో రెండు మెదళ్ళు కలిగిన వ్యక్తిగా ఆది నటించాడు. ఆ పాత్రకు ఏవిధంగా ప్రవర్తిస్తుందో.. వివిధ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటుందో చెప్పేదే బుర్రకథ. హీరో పాత్రలో ఆది ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. పూర్తి వైవిధ్యభరితంగా రూపొందిన ఈ సినిమాలో మిస్తీ చక్రబోర్తీ, నైరా షా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నాడు.

Related posts