telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మర్డర్ : బిడ్డతో అమృత… పోస్టర్ ను విడుదల చేసిన వర్మ

murder

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశవ్యాప్త సంచలనం సృష్టించిన మారుతీరావు- అమృత రియల్ స్టోరీకి “మర్డర్” అనే టైటిల్ ఫిక్స్ చేసి ‘కుటుంబ కథా చిత్రమ్’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన సమర్పణలోనే వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి ఇప్పటిదాకా విడుదల చేసిన పోస్టర్స్ ఓ ఎత్తయితే.. తాజాగా విడుదల చేసిన పోస్టర్ మరో ఎత్తయింది. కిరాయి హంతకుల చేతిలో ప్రయణ్ చనిపోయిన తర్వాత అమృతకు మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌లో ఆ బిడ్డను చూపిస్తూ ఆ దీన గాధను మరోసారి గుర్తుచేశారు వర్మ. తన ట్విట్టర్ వేదికగా ఈ పోస్టర్ షేర్ చేసిన వర్మ.. అమృత పాత్ర పోషించిన నటి ఆవంచ సాహితి పండించిన ఎమోషన్‌కి ఫిదా అయ్యానని పేర్కొన్నారు. ప్రణయ్ పరువు హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అమృత తండ్రి ఆత్మహత్య తదితర అంశాలను ఫోకస్ చేస్తూ ఈ మూవీ రూపొందిస్తున్నారు.

Related posts