telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో పీసీసీకి కొత్త సారథి వేట … ఆ ఇద్దరే రేస్ లో ఉన్నారట..

another congress mla into trs

కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో శూన్యం అయిపోతుండటంతో అధిష్టానం కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతుంది. అయితే ఎవరికి ఈ బాధ్యతలు అప్పగించాలనే దానిపై తీవ్ర కసరత్తు చేస్తున్నట్టే తెలుస్తుంది. ఎందుకంటే, ఇప్పటికే రాష్ట్రంలో పోటీ ఎక్కువగానే ఉండటంతో .. అధిష్టానం ఇద్దరినీ ప్రముఖంగా గుర్తించినట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరిలో ఒకరిని ఖాయం చేయనున్నారు. అసలు ఏఐసీసీ కి రాహుల్ రాజీనామా చేయడంతో తెలంగాణలో పీసీసీ కీలక నేతలంతా తమ పదవులకు రాజీనామా చేశారు. దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పీసీసీ నేతలంతా రాజీనామాలు చేశారు. ఇదే అదునుగా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనలో ఉన్నారట ఢిల్లీ హస్తం నేతలు. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కొవాలంటే బలమైన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ చేస్తున్నారట పీసీసీ నేతలు.

ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నేతలంతా పీసీసీ చీఫ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. తెలంగాణలో రేవంత్ రెడ్డి లాంటి మాటకారితోనే పార్టీ మనుగడ సాగిస్తుందని..అదే టైంలో గులాబీ నేతలకు ధీటుగా నిలపడతారనే మాటను హై కమాండ్ కు చెబుతున్నారట రేవంత్ వర్గం నేతలు. రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే పనిలో బిజీ అయ్యారట సీనియర్ నేతలు. తమను నిన్న కాక మొన్న వచ్చిన రేవంత్ కు పార్టీలో పెద్ద పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారట. అంతేకాదు ఓటుకు నోటు కేసు విషయాన్ని గుర్తు చేస్తూ హై కమాండ్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లే పనిలో బిజీగా ఉన్నారట. హైకమాండ్ నేతలు మాత్రం…బలమైన నేతకే పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట. రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు బాగా ప్రచారంలో ఉన్నాయంటున్నారు.

Related posts