telugu navyamedia
andhra political

ఏపీలో మరో పార్టీ …  అధికారిక ప్రకటన

MLC Elections in AP 5 unanimous
ఏలూరు: రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం లోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ప్రజాశాంతి పార్టీ పోటీ చేయనున్నట్టు రాష్ట్ర కో-ఆర్డినే టర్‌ హిప్నో కమలాకర్‌ వెల్ల డించారు. ఈ విషయంలో ఇప్పటికే తమ పార్టీతో వివిధ ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్యులు కూడా సంప్రదిం పులు జరుపుతున్నట్టు చెప్పా రు. మంగళవారం ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడా రు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజాశాంతి పార్టీ సంకల్పించిందని చెప్పారు.
తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.ఎ.పాల్‌పై అవగాహన లేనివారంతా ఇప్పటిదాకా రకరకాలుగా వదంతు లు సృష్టించారని, కొన్ని రాజకీయ పక్షాలు సహించలేక కేసులు పెట్టించాయని, ఇవన్నీ వీడిపోతున్నాయని చెప్పారు. కె.ఎ.పాల్‌ కరుడుగట్టిన మతవాది అయితే తాను హేతు వాదినని, అయినప్పటికీ పాల్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసం రంగంలోకి దిగి శ్రమించేందుకు సిద్ధంగా ఉండడంతో ఆయనకు తోడుగా నిలిచానని చెప్పారు.
రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ప్రజలు కోరుకున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ విషయం లో తప్పటడుగు వేశారని విమర్శించారు. వీటన్నింటిపైనా ఈనెల 8న భీమవరంలో ప్రజాశాంతి పార్టీ సభ నిర్వ హిస్తున్నట్టు వెల్లడించారు. ప్రజలకు సామాజిక, రాజకీయ భద్రత కల్పించడమే ప్రజాశాంతి ముఖ్య ఉద్దేశ్యమని, నవ్యాంధ్ర అభివృద్ధికి కష్టించి పనిచేస్తామని కమలాకర్‌ చెప్పారు.

Related posts

జకర్తాలో ప్రళయం సృష్టించిన సునామి… 373 మృతి…

vimala p

ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్‌ విడుదల

vimala p

ఇన్ స్పెక్టర్ కూతురిపై.. సామూహిక అత్యాచారం… అదుపులో నిందితులు..

vimala p