telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

అంధుల కోసం .. కొత్త మొబైల్ యాప్..

new mobile app for blind

అంధుల కోసం కృత్రిమమేథతో పనిచేసే పాకెట్ విజన్ అనే సరికొత్త యాప్‌ను, చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ హానర్‌ విడుదల చేసింది. ఈ యాప్‌ని ఉపయోగించి దివ్యాంగులు డాక్యుమెంట్స్, మెనూలాంటి కష్టతరమైన వాటిని సులభంగా చదవవచ్చు. ప్రస్తుతం ఇది టెక్స్ట్ టూ స్పీచ్, జూం ఇన్, నెగెటివ్ ఇమేజ్ అనే మూడు మాధ్యమాల్లో లభ్యమవుతుంది.అంతేకాకుండా ఈ యాప్ ఆరు బాషలతో అందుబాటులో వుంది.అవి ఇంగ్లిష్, పోర్చుగీస్, జర్మనీ, స్పానిష్, ఇటాలియన్, చైనీస్ లాంటి భాషలను సపోర్ట్ చేస్తుంది. ఇందులో వున్న టెక్స్ట్ టూ స్పీచ్ ద్వారా చిత్రాలని టెక్స్ట్ రూపంలోకి మార్చుకోవచ్చు.

దానితో పాటు పుస్తకాలు, డాక్యుమెంట్స్, మెనూ వంటి ఇతర వాటిలో ఉండే టెక్ట్స్‌నుసులభంగా చదివి వినిపిస్తుంది. జూం ఇన్ ను ఉపయోగించి ఫోనులోని వాల్యూమ్‌ బటన్స్‌తో పదాలను పెద్దవి చేసుకోని చదివే సౌలభ్యాన్ని కల్పిస్తుంది. నెగెటివ్ ఇమేజ్ ద్వారా టెక్ట్స్‌కు కలర్ ఫిల్టర్స్‌ను జతచేయవచ్చు.

Related posts