telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

22న 15మంది ఎమ్మెల్యేల .. ప్రమాణస్వీకారం.. జలవనరుల శాఖపై పలువురి కన్ను..

yadurappa karnataka

ఈనెల 22న ఉప ఎన్నికల్లో గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనసభ స్పీకర్‌ విశ్వేశ్వరహెగ్డే కాగేరి విధానసౌధలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో ఏర్పాటు కు ఆదేశించారు. 12మంది బీజేపీ, ఇరువురు కాంగ్రెస్‌తోపాటు స్వతంత్ర ఎమ్మెల్యే శరత్‌ బచ్చేగౌడలు ప్రమాణస్వీకారం చేయను న్నారు. ప్రమాణం చేసేవారిలో ఎస్‌.టి.సో మశేఖర్‌ – యశ్వంతపుర, కె.గోపాలయ్య – మహాలక్ష్మీ లే అవుట్‌, భైరతి బసవరాజ్‌ – కె.ఆర్‌.పురం, డా.కె.సుధాకర్‌ – చిక్కబళ్ళాపుర, కేసీ .నారాయణగౌడ – కె.ఆర్‌.పేట, అరుణ్‌ పూజార్‌ – రాణిబెన్నూరు, బీసీ పాటిల్‌ – హిరేకెరూరు, ఆనంద్‌సింగ్‌ – విజయన గర్‌, రమేశ్‌జార్కిహొళి – గోకాక్‌, మహేశ్‌కుమటళ్ళి – అథణి, శ్రీమంతపాటిల్‌ – కాగవాడ, హెచ్‌పీ మంజునాథ్‌ – హుణసూరు, రిజ్వాన్‌ అర్షద్‌ – శివాజీనగర్‌, శరత్‌బచ్చేగౌడ – హొస్కోటెలు ఉన్నారు. 17మంది ఎమ్మెల్యేల రాజీనామాతో సంకీర్ణప్ర భుత్వం కూలిన విషయం తెలిసిందే. వీరందరినీ అప్పటి స్పీకర్‌ అనర్హులుగా గుర్తించగా ఇటీవల 15 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 12 మంది బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ప్రస్తుతం శాసనసభలో బీజేపీకి 117మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ప్రభుత్వానికి తిరుగులేకుండా పోయింది.

కొత్త ఎమ్మెల్యేలు రావటంతో.. మంత్రి మండలి విస్తరణ లేక ప్రక్షాళన ఉంటుందో ఇంకా స్పష్టం కావడం లేదు. అయితే కీలక శాఖల కోసం అప్పుడే సిగపట్లు ప్రారంభ మయ్యాయి. అత్యంత కీలకమైన జలవనరు లశాఖ కోసం ముగ్గురు నేతలు పట్టుబట్టు తుండడంతో ముఖ్యమంత్రి యడియూర ప్పకు మింగుడు పడడం లేదు. హోంశాఖ చేజారే పక్షంలో తనకు జలవనరులశాఖ కావాల్సిందేనని బసవరాజ్‌ బొమ్మై పట్టుబ ట్టుతున్నారు. ఇక ఉపముఖ్యమంత్రి అయితే తనకు జలవనరులశాఖ ఉండాల్సిందేనని ఇటీవల బెళగావి జిల్లాలోని గోకాక్‌ నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన రమేశ్‌ జార్కిహొళి మొండికేశారు. ఇదే జిల్లా నుంచి కేబినెట్‌లో చోటు ఖాయమని భావిస్తున్న ఉమేశ్‌కత్తి కూడా జలవనరులశాఖపై కన్నే శారు. ఈ ముగ్గురు కూడా జలవనరులశాఖ కావాలని కోరుతుండడంతో యడియూరప్ప పరిస్థితి ఇరకాటంలో పడింది. అధిష్ఠానం జోక్యం చేసుకుంటే తప్ప ఈ వివాదం సద్దుమణిగే అవకాశం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.

Related posts