• Home
  • Trending Today
  • శేఖర్ కమ్ములకు కొత్త హీరో దొరికేనా ?
Trending Today సినిమా వార్తలు

శేఖర్ కమ్ములకు కొత్త హీరో దొరికేనా ?

shekhar kammula

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన “ఫిదా” చిత్రం ప్రేక్షకులను ఫిదా చేసి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. అయితే “ఫిదా” చిత్రం గతేడాది విడుదలైంది. శేఖర్ కమ్ముల తరువాత చిత్రం ఏంటి ? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య నాని అలాగే రానా వంటి హీరోలతో సినిమా చేస్తున్నట్లు టాక్ వచ్చింది… కానీ అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. ఇక తాజాగా ఏషియన్ సునీల్ నిర్మాణ సారథ్యంలో సినిమా చేయాలనీ శేఖర్ కమ్ముల ఫిక్సయినట్లు సమాచారం. డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న ఏషియన్ సునీల్ చాలా కాలంగా నిర్మాతగా మారాలని అనుకుంటున్నారు. శేఖర్ కమ్ములతో సినిమా చేయాలనీ ఎప్పటినుంచో సన్నాహాలు చేస్తున్నారు.

చివరికి మంచి కథ కుదరడంతో నటీనటుల ఎంపికలో, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో శేఖర్ కమ్ముల బిజీగా ఉన్నారని తెలుస్తోంది. అయితే స్టార్ హీరోలను కాకుండా కొత్త హీరోలని పరిచయం చేయాలని అనుకుంటున్నాడట దర్శకుడు. ఆడిషన్స్ నిర్వహించి అందులో ఫైనల్ గా అయిదుగురిని తీసుకొని ఒకరిని సెలక్ట్ చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అతిత్వరలోనే మిగతా వివరాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది.

Related posts

పక్కన అందమైన అమ్మాయి ఉన్నా పట్టించుకోడు

jithu j

సినిమాకే "సై రా" అంటున్న చిరంజీవి

admin

అక్టోబర్ 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ ” బేవ‌ర్స్ ” చిత్రం విడుద‌ల‌

jithu j

Leave a Comment