telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

ఖాళీ బెర్తుల వివరాలు .. ఆన్ లైన్ లో .. : రైల్వే శాఖ

new feature with irctc about free berths

ఐఆర్‌సీటీసీ రైల్వే ప్ర‌యాణికుల కోసం మ‌రో కొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. చార్ట్స్/వెకెన్సీ ఫీచ‌ర్ పేరిట ల‌భ్య‌మ‌వుతున్న ఈ ఫీచ‌ర్‌ను ప్ర‌యాణికులు ఐఆర్‌సీటీసీ యాప్‌, వెబ్‌సైట్‌ల‌లో పొంద‌వ‌చ్చు. దీని ద్వారా ప్ర‌యాణికులు తాము ప్ర‌యాణించాల‌నుకున్న రైలులో ఖాళీగా ఉన్న బెర్తుల వివ‌రాల‌ను టీటీఈతో సంబంధం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లోనే తెలుసుకోవ‌చ్చు.

ఈ యాప్ లేదా వెబ్‌సైట్ లో ప్ర‌యాణికులు తాము వెళ్లాల‌నుకునే ఫ్ర‌మ్‌, టు స్టేష‌న్ల వివ‌రాలు, తేదీ ఎంట‌ర్ చేసి కింద ఉండే చార్ట్స్/వెకెన్సీ ఆప్ష‌న్‌ను క్లిక్ చేస్తే ఓ విండో వస్తుంది. అందులో తాము ప్ర‌యాణం చేసే ట్రెయిన్ నంబ‌ర్‌, తేదీ, బోర్డింగ్ వివ‌రాల‌ను ఎంటర్ చేసి కింద ఉండే స‌బ్‌మిట్ బ‌ట‌న్‌ను క్లిక్ చేస్తే మ‌రో విండో వ‌స్తుంది. అందులో ఆ ట్రెయిన్‌కు చెందిన అన్ని కోచ్ లు నంబ‌ర్ల రూపంలో క‌నిపిస్తాయి. ఏదైనా కోచ్ నంబ‌ర్ పై క్లిక్ చేస్తే కింది భాగంలో కోచ్‌లో ఉన్న అన్ని బెర్తుల నంబ‌ర్లు క‌నిపిస్తాయి. వాటిలో ఖాళీగా ఉన్న బెర్త్‌లు గ్రీన్ క‌ల‌ర్ లో క‌నిపిస్తాయి.

దీనితో ప్ర‌యాణికులు ఖాళీగా ఉన్న బెర్త్ నంబ‌ర్ల‌ను నోట్ చేసుకుని వాటిని టీటీఈకి చెబితే టీటీఈ ప్రయాణికుల‌కు ఆ బెర్త్‌ను కేటాయిస్తారు. దీని వ‌ల్ల టీటీఈలు రైలులో బెర్తులు ఖాళీ లేవ‌ని చెప్ప‌డం కుద‌రదు. ఈ క్ర‌మంలోనే రైలు ప్రారంభ‌మ‌య్యే ముందు ప్రిపేర్ అయ్యే చార్టులు రెండింటినీ ఆన్‌లైన్‌లో పొందు ప‌రుస్తారు. దీని వ‌ల్ల రైలులో ఖాళీగా ఉన్న బెర్తుల వివ‌రాలు ప్ర‌యాణికులకు ఐఆర్‌సీటీసీ యాప్ లేదా సైట్‌లో సుల‌భంగా తెలుస్తాయి.

Related posts