telugu navyamedia
సాంకేతిక

వాట్సాప్ లో సరికొత్త ఫీచర్… ఇక ఫేక్ న్యూస్ కు చెక్

mail provided by dot for whatsapp affected
సోషల్ మీడియాలో అత్యంత్య ప్రజాదరణ పొందిన యాప్ వాట్సాప్. కానీ ఇప్పుడు ఈ యాప్ లో చాలా వరకు ఫేక్ న్యూస్ షేర్ అవుతోంది. అందుకే ఇలాంటి ఫేక్ న్యూస్‌ను అరికట్టేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. ఒకవైపు మెసేజ్ ఫార్వర్డింగ్‌కు లిమిట్స్‌, మరోవైపు తన వినియోగదారులకు ఫేక్ న్యూస్‌ను గురించిన అవగాహన కల్పించేలా వాణిజ్య ప్రకటనలు ఇస్తోంది. తాజాగా ఈ యాప్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ పేరిట మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది వాట్సప్ యాజమాన్యం.
వాట్సాప్ బీటా 2.19.73 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లో రివర్స్‌ సెర్చ్ ఇంజిన్‌ ఫీచర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బీటా యూజర్లు మాత్రమే ఉపయోగించగలరు. రివర్స్ సెర్చ్ ఇంజిన్ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు.
ఈ రివర్స్ ఇమేజ్ సెర్చ్ కోసం… 
వాట్సాప్ చాట్‌లో వచ్చిన ఏదైనా ఇమేజ్‌ను సెలెక్ట్ చేసుకుంటే… పైన మూడు చుక్కలు కనిపిస్తాయి.
 వీటిపై టచ్ చేస్తే మెనూ ఓపెన్ అవుతుంది. 
ఇందులో మీకు ఇమేజ్ సెర్చ్ ఫీచర్ కనిపిస్తుంది. 
దీనిపై క్లిక్ చేస్తే బ్రౌజర్ విండో ఓపెన్ అవుతుంది. 
అక్కడ వాట్సాప్ చాట్‌లో వచ్చిన ఫోటోకు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. 
అక్కడ చాట్ ఫోటోను పోలిన ఇతర ఫోటోలను చూడవచ్చు. 
దీని ద్వారా యూజర్‌కు వచ్చిన ఇమేజ్ నిజమైందా? కాదా? అని తెలుసుకోగలుగుతారు. 

Related posts