telugu navyamedia
వార్తలు సామాజిక

ఢిల్లీ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు బెడ్ల కొరత!

Corona

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. దీంతో ఆసుపత్రుల్లో కరోనా రోగులకు బెడ్ల కొరత ఏర్పడింది. ఇకపై వచ్చే రోగులకు చికిత్స చేసేందుకు బెడ్లు లేవని న్యూఢిల్లీలోని ప్రముఖ ఆసుపత్రులు అంటున్నాయి. ఢిల్లీలో కరోనా చికిత్సలు అందిస్తున్న మ్యాక్స్ హాస్పిటల్స్, ఫోర్టిస్ హాస్పిటల్స్, హోలీ ఫ్యామిలీ హాస్పిటల్స్, తమ ఆసుపత్రులు నిండిపోయాయని అంటున్నాయి. ఇదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం మాత్రం బెడ్లకు కొరత లేదని అధికారిక యాప్ లో చూపిస్తుండటం గమనార్హం.

కరోనాపై సమాచారాన్ని అందిస్తున్న ‘ఢిల్లీ కరోనా’ యాప్ లో ఫోర్టిస్ గ్రూప్ ఆసుపత్రుల్లో 32 బెడ్లు ఖాళీ ఉన్నట్టు చూపిస్తుండగా, “ప్రస్తుతం మా వద్ద ఏ బెడ్ కూడా ఖాళీగా లేదు. ఐసీయూ సైతం నిండిపోయింది. ఆ యాప్ లో ఏదో సమస్య ఉంది” అని ఆసుపత్రి ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. హోలీ ఫ్యామిలీ ఆసుపత్రి వర్గాలు కూడా ఇదే విధమైన సమాచారాన్ని అందించాయి. యాప్ లో వివరాలు అప్ డేట్ కావడం లేదని ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి.

Related posts