telugu navyamedia
రాజకీయ వార్తలు సాంకేతిక

మీ వాహనం దారి మద్యలో చెడిపోయిందా? అయితే ఇక క్షణాల్లో రిపేర్…

Repayr New App for Vehicles and mechanics (1)

మీ వాహనం దారి మద్యలో చెడిపోయిందా? అయితే మీరు కంగారు పడాల్సిన పనిలేదు. మీ దగ్గరు 10నిమిషాల్లోనే మెకానిక్ వస్తాడు. మీ వాహనాన్ని రిపేర్ చేస్తాడు. అవును మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మెకానిక్ సోదరులుకూడా ఇప్పుడు వారు తమ సెల్ ఫోన్లకు పనిపెడుతున్నారు. మార్కెట్ లోకి రోజు రోజుకు ఎన్నో యాప్ లు వస్తున్నాయి. తాజాగా రిపేర్ అనే యాప్ అటు వాహనదారులకు , ఇటు మెకానిక్ లకు ఎంతో ఉపయోగపడనుందని ఎల్పీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. సయన ఇనుస్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన రిపేర్ యాప్ ను నాగోల్ లోని శివ పంక్షన్ హాల్లో మెకానిక్ ల సమక్షంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. ఇక పై వాహనదారులు తమ వెహికిల్ ఆగిపోయిందని బాధపడాల్సిన పనిలేదు వెహికిల్ డాక్టర్లు వచ్చి క్షణాల్లో రీపేర్ చేస్తారని అయన అన్నారు. నగరంలో ప్రయాణించే వాహనదారులు ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.

Repayr New App for Vehicles and mechanics (1)

టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనలో కూడా మార్పు రావాలి. ఇంకా పాత పద్ధతినే కొనసాగిస్తే మనము మన వ్యాపారాలు ముందుకు వెళ్ళవు. నూతన ఒరవడి అనేది ప్రతి వ్యాపారంలో వస్తుంది. టెక్నాలజీని అందిపుచ్చుకుని మన వ్యాపారాన్ని కూడా మెరుగు పరుచుకోవాల సిన అవసరం ప్రస్తుత కాలంలో ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మెకానికల్ అంటే వెహికల్ డాక్టర్ లు అని ఈ యాప్ గురించి మెకానికల్ అందరూ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలని ఇది మెకానిక్ సోదరులందరికీ కోసం ఉపయోగపడే అద్భుతమైన యాప్ అని సుధీర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో యాప్ రూపొందించిన రామ్ కౌండిన్య, షాడో మధుబాబు, రిపేర్ యాప్ ఎండి సత్యప్రసాద్ తో పాటు 500 మంది మెకానిక్ లు పాల్గొన్నారు.

(డా.దిశ లాంటి సంఘటనలను టెక్నాలజీ ద్వారా కొంతమేరకు అడ్డుకట్ట వేయవచ్చని, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల ఇలాంటి సంఘటనలు పునరావ్రుతం కావనీ ఎల్పీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. )

Related posts