telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సాంకేతిక

బి.ఎస్.ఎన్.ఎల్. .. పండుగ సందర్భంగా.. బంపర్ ఆఫర్లు…

ప్రభుత్వరంగ సంస్థగా బి.ఎస్.ఎన్.ఎల్. ఇటీవల ప్రైవేట్ రంగ సంస్థలతో జోరుగా పోటీపడుతోంది. ఆయా ప్రైవేట్ సంస్థలతో పోటీగా భారీ ఆఫర్లను వినియోగదారులకు అందిస్తుంది. తాజాగా, తన వినియోగదారులను కాపాడుకోవడం, కొత్త వారిని ఆకర్షించడం లక్ష్యంగా భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) నూతన సంవత్సరం సందర్భంగా మొబైల్‌ వినియోగదారులకు పలు ఆఫర్లను ప్రకటించింది. అపరమిత కాల్స్‌, డేటా, ఉచిత రింగ్‌టోన్స్‌ వంటి ప్రయోజనాలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఆఫర్లకు సంబంధించిన వివరాలను తెలంగాణ టెలికాం సర్కిల్‌ సీజీఎం వి.సుందర్‌ వెల్లడించారు.

ఇందులో వర్షికా-1699, 2099 ప్లాన్‌ లు ఆకర్షణీయంగా ఉన్నాయి . ఈ ప్లాన్ లలో రూ.1,699 చెల్లించి ఏడాదిపాటు అపరిమిత (లోకల్‌ అండ్‌ రోమింగ్‌) వాయిస్‌కాల్స్‌, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు, ఉచిత కాలర్‌ట్యూన్‌, అపరిమిత డేటా పొందవచ్చు. అయితే డేటా వినియోగదారులు ఒకరోజులో 2జీబీ డేటా ఉపయోగించాక వేగం 80 కేబీపీఎస్‌కు తగ్గిస్తారు. ఇవే ఆఫర్లు వర్షికా ప్లస్‌-2099 ప్లాన్‌కూ వర్తిస్తాయి. రూ.2,099తో రీచార్జ్‌ చేసుకుంటే రోజుకు 4జీబీ వినియోగించాక డేటా వేగం 80 కేబీపీఎస్‌కు కుదిస్తారు. రాష్ట్రంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పటికే 487 వైఫై హాట్‌స్పాట్‌లను నెలకొల్పింది. మరో 423 హాట్‌స్పాట్‌లను ఫిబ్రవరిలోగా ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా 100 మీటర్ల పరిధిలో 2 నుంచి 10 ఎంబీపీఎస్‌ వేగంతో రోజుకు 4జీబీ డేటా చొప్పున బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు పొందొచ్చు.

ఇక రూ.300 టాప్‌ అప్‌తో రూ.30, గురు, శుక్ర, శనివారాల్లో రూ.250, సోమ, మంగళ, బుధవారాల్లో రూ.500, రూ.600 టాప్‌అప్‌ చేయించుకుంటే పదిశాతం అదనంగా టాక్‌టైం లభిస్తుంది. కాంబో ఎస్టీవీ-175లో రూ.200, కాంబో ఎస్టీవీ-219లో రూ.250 టాక్‌టైంతో పాటు 0.5 జీబీ డేటా 60 రోజుల కాలపరిమితితో లభిస్తోంది. కాంబో ఎస్టీవీ-252లో రూ.350 టాక్‌ టైం, 2 జీబీ డేటా, కాంబో ఎస్టీవీ-402లో రూ.600 టాక్‌ టైం, 4జీబీ డేటా 60 రోజుల కాలపరిమితితో అందిస్తున్నారు.

Related posts