telugu navyamedia
news political trending

కొత్త మద్యం పాలసీ… అద్దె రూపాయే..

people rush for alcohol in delhi at 6pm

ఏపీలో నూతన మద్యం విధానం అమలులోకి రానుండగా, కొత్త షాపులు తమ షాపులోనే పెట్టాలని భావిస్తున్న వారు పోటీ పడి మరీ అద్దెలను తగ్గిస్తున్నారు. ఒకసారి షాపు పెడితే, అనుబంధ దుకాణాలను తామే నడుపుకోవచ్చని, దాని ద్వారా భారీగా ఆదాయాన్ని పొందవచ్చన్న భావనలో ఉన్న పలువురు కేవలం రూపాయి అద్దెకు తమ షాపులను ఇస్తామని ముందుకు వస్తుండటం గమనార్హం.

అధికారులు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో అద్దె షాపుల ఎంపికకు ఓపెన్‌ టెండర్లను అహ్వానించగా, తీవ్రస్థాయిలో పోటీ నెలకొన్న కారణంగా అతి తక్కువ ధరకే షాపులు అద్దెకిస్తామని పలువురు ముందుకు వచ్చారు. రూ.1కే తాము షాపులను ఇస్తామని 30వ డివిజన్‌, పెదవేగి మండలం కూచింపూడి, కొప్పులవారిగూడెం, కొప్పాక గ్రామంలోని వారు టెండర్లను దాఖలు చేయడం గమనార్హం. ఇక అతి తక్కువ ధరకు కోట్ అయిన ప్రాంతాల్లో లాటరీ ద్వారా దుకాణాలను ఎంపిక చేస్తామని అధికారులు అంటున్నారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

Related posts

ఇంటర్‌ విద్యార్థుల రీవెరిఫికేషన్‌ ఫలితాలు విడుదల

vimala p

డ్రోన్ రాజకీయాలు … వద్దంటున్న .. జనసేనాని..

vimala p

ఆ కేసులతో నాకు సంబంధం లేదు: రాయపాటి

vimala p