telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జయలలిత పాత్రలో నటించడానికి నేనే పర్‌ఫెక్ట్ : నిత్యామీనన్

Nityamenon

ప్రస్తుతం తమిళనాట జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ప్రస్తుతం రెండు చిత్రాలు, ఒక వెబ్‌ సిరీస్‌ రూపొందుతున్నాయి. దర్శకుడు గౌతమ్‌మీనన్‌ `దీ క్వీన్‌` పేరుతో రూపొందిస్తున్న వెబ్‌ సిరీస్‌లో జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది. ఇక విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న`తలైవి` చిత్రంలో జయలలితగా బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌ నటిస్తోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్‌ ఇటీవల విడుదలయ్యాయి. జయలలితగా కంగనారనౌత్‌ సరిపోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇక, ప్రియదర్శిని దర్శకత్వంలో తెరకెక్కుతున్న జయలలిత బయోపిక్‌కు `ది ఐరన్ లేడీ` అని టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో జయలలిత పాత్రలో హీరోయిన్ నిత్యా మీనన్ నటిస్తోంది. `తలైవి` చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల నేపథ్యంలో జయలలిత బయోపిక్‌ గురించి నిత్య స్పందించింది. `జయలలిత బయోపిక్‌లో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఆమె పాత్రలో నటించడానికి నేనే పర్‌ఫెక్ట్. ఆమె గురించి క్షుణ్నంగా తెలుసుకున్నాను. ఆమెలాగానే నాది కూడా ధైర్యంగా మాట్లాడగలిగే స్వభావం. ఆమెలా మారడానికి ఎంతో కష్టపడుతున్నా. జయలలిత పాత్రకు వంద శాతం న్యాయం చేస్తాను” అని నిత్య తెలిపింది.

Related posts