telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్-3 స్టార్ట్ కాకముందే నాగ్ పై విమర్శలు

Nagarjuna

తెలుగులో సీజ‌న్ 3 బిగ్ బాస్ సిద్ధమైంది. గ‌త కొద్ది రోజులుగా ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ కార్య‌క్ర‌మాన్ని హోస్ట్ చేసే వారితో పాటు పాల్గొనే వారికి సంబంధించి అనేక పేర్లు సామాజిక మాధ్య‌మాల‌లో చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే స్టార్ మా యాజ‌మాన్యం తాజాగా బిగ్ బాస్-3 కార్య‌క్ర‌మాన్ని వెండితెర మ‌న్మ‌థుడు నాగార్జున హోస్ట్ చేయ‌బోతున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించారు. నాగార్జున మాట్లాడుతూ “నేను ఎన్నో విష‌యాల‌లో ప్ర‌యోగాలు చేశాను. నాకు టెలివిజ‌న్ కొత్త కాదు. బిగ్ బాస్ లాంటి షో చేయ‌డం కొత్త అనుభూతి. ఇలాంటి షోలో నేను ఓ పార్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కొత్త ప్ర‌యాణం కోసం ఎదురు చూస్తున్నాను అని నాగ్ పేర్కొన్నారు. అయితే ఈ సారి ఆ కార్య‌క్ర‌మం ప్రారంభం కాక‌ముందే నాగార్జున‌పై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. దానికి కార‌ణం నాగార్జున గ‌తంలో `బిగ్‌బాస్‌`పై చేసిన వ్యాఖ్య‌లు. “దేవ‌దాస్‌` సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో నాగ్‌ “బిగ్‌బాస్” గురించి నేను మాట్లాడాల‌నుకోవ‌డం లేదు. ఎందుకంటే నేను మాట్లాడితే చెడుగా మాట్లాడాల్సి వ‌స్తుంది. నేను నాని హోస్టింగ్ గురించి మాట్లాడ‌డం లేదు. నాకు అస‌లు “బిగ్‌బాస్‌” కాన్సెప్టే న‌చ్చ‌లేదు. ఇత‌రులు ఏమి చేస్తున్నారో? ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నారో గ‌మ‌నించ‌డం బాగుండ‌దు. నాకు అది న‌చ్చ‌దు. ఈ షో అంతా ఏదో గాసిపింగ్‌లా ఉంద‌`ని నాగ్ వ్యాఖ్యానించారు. అప్పుడు అంతలా అస‌హ్యించుకున్న కార్యక్ర‌మానికి నాగ్ ఇప్పుడు ఎలా హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప‌లువురు నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. 100 రోజుల పాటు ఆస‌క్తిక‌రంగా సాగ‌నున్న ఈ షోలో పాల్గొనే 14 మంది కంటెస్టెంట్స్ ఎవ‌ర‌న‌ది తెలియాలంటే షో ప్రారంభం వ‌ర‌కు ఆగాల్సిందే. జూలై 21 నుండి తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 3 స్టార్ట్ కానుంద‌ని తెలుస్తుంది.

Related posts