telugu navyamedia
సినిమా వార్తలు

బాలయ్యపై ట్రోలింగ్… పదేపదే చెప్పినా మళ్ళీ అదే తప్పు…

balakrishna and tarak at 118 pre release event

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రసంగించిన ప్రతిసారీ తప్పులు దొర్లడం సర్వసాధారణం అయిపోయింది. ఇక దొరికిందే అదునుగా యాంటీ బాలకృష్ణ అభిమానులు సోషల్ మీడియాలో బాలకృష్ణ ప్రసంగాల్లో చేసే తప్పులను చూపిస్తూ ట్రోలింగ్ చేయడం కూడా మామూలే. తాజాగా మరోసారి బాలకృష్ణ ఇలాంటి పొరపాటే చేశారు. నందమూరి కళ్యాణ్ హీరోగా రూపొందుతన్న తాజా చిత్రం “118”. ఈ చిత్రం ప్రి రిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో పాటు అందరినీ విస్తుపోయేలా చేసింది.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాలయ్య తన ప్రసంగంలో సినిమా పేరు “118”గా ఉన్న “189”గా చెప్పారు. ఈ పొరపాటును గమనించిన ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌లు దగ్గరికి వచ్చి చెప్పినా ఫలితం లేకపోయింది. వారి మాటలను పట్టించుకోకుండా బాలకృష్ణ మళ్లీ ఆఖర్లో “189” అంటూనే ముగించడం గమనార్హం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts