telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పన్నెండేళ్ల కూతురు… ఇప్పుడు రెండో పెళ్లేంటీ…? నటికి నెటిజన్ ప్రశ్న

Kamya

సెలబ్రిటీలను టార్గెట్ చేసి వారిని ట్రోల్ చేయడం చాలా సులువు అనుకుంటూ ఉంటారు నెటిజన్లు. కొందరు సెలబ్రిటీలు తమను ట్రోల్ చేసినవారిని బ్లాక్ చేస్తుంటారు. మరికొందరు మూతిపగిలేలా సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి కామ్యా పంజాబీ నిన్న రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఇదివరకే పెళ్లై పన్నెండేళ్ల కూతురు కూడా ఉంది. ఇప్పుడు కామ్యా వయసు 40. ఎదుగుతున్న కూతురు ఉన్నా కూడా మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఓ నెటిజన్ ఆమెను ఎగతాళి చేసాడు. అయితే దీనిపై కామ్యా స్పందించలేదు కానీ ఆమె స్నేహితురాలు, నటి కవితా కౌశిక్ స్పందించారు. ‘‘ఎందుకంటే మనకు జీవితాంతం భర్త తోడుగా ఉంటాడు కాబట్టి. పిల్లల్ని కనడం కంటే జీవితంలో ఇంకా ఎంతో ఉంటుంది కదా. ఏదో ఒక రకంగా ఆనందం వెతుక్కోవాలని అనుకుంటున్న వారిలో తప్పులు వెతికి వేలెత్తి చూపకండి. ఇతరులు సంతోషంగా ఉంటున్న సమయంలో వారిని సిల్లీ ప్రశ్నలు అడగకుండా మీరు కూడా ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి. మరో విషయం ఏంటంటే.. వారి పిల్లలే సెలబ్రేషన్స్ ప్లాన్ చేసారు’’ అని తెలిపారు.

Related posts