telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అలియా భట్ మేల్ వెర్షన్… పిక్ వైరల్

Alia

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ మేల్ వెర్షన్ అంటూ ఓ పిక్ ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. క‌మెడీయ‌న్, యూట్యూబ్ సెన్సేష‌న్ భువ‌న్ భామ్ పిక్ ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతోంది. అలియా భ‌ట్ మేల్ వ‌ర్షెన్ చూస్తే ఎలా ఉంటుందో ఆయ‌న అలానే క‌నిపిస్తున్నాడు. ఈ విష‌యాన్ని ఆయ‌న కూడా చెప్పుకున్నాడు. త‌న ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. నేను బ్ల‌ష్ చేస్తున్న‌ప్పుడు అలియా భ‌ట్ మాదిరిగా కనిపిస్తాను అని రాసాడు. భువ‌న్ ఫోటో చూసిన అభిమానులు షాక్ అవ్వ‌డ‌మే కాకుండా ఆయ‌న ఫోటోతో ప‌లు మీమ్స్ చేస్తున్నారు. కాగా, అలియా భ‌ట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుంది. ఆర్ఆర్ఆర్‌లో చ‌ర‌ణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రంతో పాటు బ్ర‌హ్మాస్త్రా కూడా చేస్తుంది.

Related posts