telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రష్మికపై నెటిజన్లు ఫైర్

Rashmika

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఎంపిక చేసారు. గతేడాది నాని హీరోగా రూపొందిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ ‘జెర్సీ’. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాలో హీరోయిన్ గా శ్రద్దా శ్రీనాథ్ నాని భార్యగా యాక్టింగ్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా ఈ సినిమా అక్కడ రీమేక్ అవుతుంది. రష్మిక ను ఈ సినిమాలో హీరోయిన్ గా అనుకున్నారట చిత్ర దర్శక నిర్మాతలు. రశ్మికను సంప్రదించగా ఆమె రిజక్ట్ చేసిందని తెలుస్తుంది. రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై రష్మిక స్పందించింది. “నిజానికి అందరూ అనుకున్నట్లు నేను ఈ సినిమాను రెమ్యూనరేషన్ కోసం రిజెక్ట్ చేయలేదు. ఆ పాత్ర చాలా లోతైన ఎమోషన్స్ కలిగి ఉంది. అంత హెవీ ఎమోషన్స్ నేను చేయలేను. నా పరిధిలో నేను చేయగలను.అంతే కాకుండా డేట్స్ కూడా అడ్జెస్ట్ కాలేదు” అంటూ చెప్పుకొచ్చింది. దాంతో యాక్టింగ్ రాకుండా హీరోయిన్ ఎందుకు అయ్యావ్ ? అంటూ నెటిజన్లు అమ్మడి పై ఫైర్ అవుతున్నారు.

Related posts