telugu navyamedia
telugu cinema news trending

“సడక్-2” వరస్ట్ రికార్డు.. గంటలోనే లక్ష డిస్ లైకులు

ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్‌ దత్‌ ప్రధాన పాత్రలో సడక్ 2 సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఆదిత్యారాయ్‌ కపూర్‌, ఆలియా భట్‌ హీరో, హీరోయిన్లుగా నటిస్తునారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేశ్‌ భట్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా సడక్‌ 2 ట్రైలర్‌ వచ్చేసింది. 1991లో మహేష్‌ భట్‌ దర్శకత్వంలో వచ్చిన హిట్‌ మూవీ సడక్‌కు ఇది సీక్వెల్‌. మకర్‌ దేశ్‌ పాండే, గుల్షన్‌ గ్రోవర్, జిష్ణు సేన్‌ గుప్తా తదితరులు‌ నటిస్తున్నారు. విశేష్‌ ఫిలింస్‌ బ్యానర్‌ పేరు మీద ముఖేశ్‌ భట్‌ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో 21 ఏళ్ల తర్వాత మహేశ్‌ భట్‌ మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. తండ్రి మహేష్‌ భట్‌ దర్శకత్వంలో తొలిసారి ఆలియా నటిస్తున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం. కరోనా నేపథ్యంలో ఈ సినిమాను డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ఈనెల 28న విడుదల కానుంది. అయితే ఈ ట్రైలర్ కు ఒక్క గంటలోనే లక్షకు పైగా డిస్ లైకులు వచ్చేసాయి. దీనితో ఈ ట్రైలర్ మన దేశంలోనే మోస్ట్ డిస్ లైక్డ్ ట్రైలర్ గా నిలిచిపోయేలా ఉందని మూవీ లవర్స్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే ఈ ట్రైలర్ భారీ ఎత్తున డిస్ లైకులు కలిగిన ట్రైలర్స్ జాబితాలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇంకా ఒక్క రోజు కూడా పూర్తి కాకుండానే 1.5 మిలియన్ డిస్ లైకులు ఈ ట్రైలర్ కు వచ్చేసాయి. దీనికి ప్రధాన కారణం ఏమిటో కూడా అందరికీ తెలిసిందే. సుశాంత్ మరణానికి నిందితులుగా పరిగణించబడుతున్న మహేష్ భట్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ ట్రైలర్ కు నెటిజన్స్ ఈ వరస్ట్ రికార్డును అందించారు.

Related posts

టీవీ 9 పగ్గాలు .. మహేందర్ మిశ్రా ..

vimala p

తమిళ సినిమాకు దూరంగా సమంత… తల్లి కాబోతున్నందుకేనా…?

vimala p

హిందీ కాంచన లో .. అమితాబ్ పాత్ర ..

vimala p