ఓ నెటిజన్ నటి రేణుదేశాయ్ ను సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించాడు. దీన్ని స్క్రీన్ షాట్ తీసి ట్వీట్ చేస్తూ ఘాటుగా స్పందించారు రేణూదేశాయ్. సదరు నెటిజన్ ”నేను ఒక రైతు కొడుకుని. ఇరవై ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. నటీనటులు రైతుల కోసం ఏం చేస్తున్నారు. ఏమీ లేదు. కొన్ని డబ్బుల కోసం మేకప్ వేసుకొని కెమెరా ముందు డ్రామా చేస్తున్నారు” అని “ఎఫ్” వర్డ్స్ వాడుతూ ఆమెని దూషించాడు.
ఈ విషయంపై స్పందించిన రేణుదేశాయ్ “ఒక సెలబ్రిటీ ఎప్పుడైనా ‘ఎఫ్’ (అసభ్యపదజాలం) అనే పదాన్ని సోషల్ మీడియాలో ఒక అభిమాని మీద వాడితే అది బ్రేకింగ్ న్యూస్ అవుతుందని, అర్థం చేసుకోకుండా ఆ సెలబ్రిటీని ట్రోల్ చేస్తారని… కానీ అదే పదం ఒక మామూలు మనిషి ఒక సెలబ్రిటీ మీద వాడితే మాత్రం వాళ్లు స్పందించకూడదని అసహనం వ్యక్తం చేసింది. సెలెబ్రిటీలను ఎవరు పడితే వాళ్ళు తిట్టొచ్చు. కానీ సెలెబ్రిటీలు మాత్రం అవన్నీ భరిస్తూ మౌనంగా ఉండాలి. మాకు మాత్రం భావోద్వేగాలు ఉండవా ? రైతులకు ఏదో ఒక విధంగా సహాయపడాలని నేను చేస్తున్న ప్రయత్నాన్ని ఈ విధంగా విమర్శించడం దారుణం… ట్రోల్స్ చేసేవారంతా సెలెబ్రిటీలు చేసే ప్రతీ పనికి ఏదో ఒక పేరు పెట్టకుండా… ఏదైనా మంచి పని కోసం కృషి చేస్తే మంచిది” అంటూ పోస్ట్ చేశారు.