telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ స్టార్ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తే… హీరోకు బెదిరింపులు

Siddhanth

‘గల్లీ బాయ్’ సినిమాతో బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది జాతకమే మారిపోయింది. ఈ సినిమాలో అతని క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సిద్ధాంత్‌కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ యంగ్ హీరో త్వరలో అగ్ర కథానాయిక దీపిక పదుకోన్‌తో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని సిద్ధాంత్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు. ‘త్వరలో నేను దీపిక పదుకోన్, అనన్య పాండేతో కలిసి నటించబోతున్నాను’ అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్ చూసి దీపిక అభిమాని అయిన ఓ నెటిజన్‌కు సిద్ధాంత్‌ను బెదిరించాడు. “సాలే దీపిక పదుకోన్‌తో రొమాన్స్ చేసే అవకాశం వచ్చిందా నీకు. నిన్ను చంపేస్తా” అని బెదిరించాడు. అయితే ఈ బెదిరింపులకు సిద్ధాంత్ ఏమీ భయపడలేదు. పైగా అతనికి మూతి పగిలేలా ఆన్సర్ ఇచ్చాడు. ‘ఏం చేయమంటావ్. నన్ను దీపికతో రొమాన్స్ చేయనివ్వు. ఆ తర్వాత నన్ను చంపేయ్. ఎలాగో దీపిక పదుకోన్‌తో రొమాన్స్ చేసి చేసి నేనే చచ్చిపోతా’ అని రిప్లై ఇచ్చాడు.

Related posts