telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరంజీవిని పొగడకపోతే ఇండస్ట్రీలో కష్టమా ?

Chiranjeevi

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల కానుంది. ఇక మెగాస్టార్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సినీ పరిశ్రమలోకి ప్రవేశించినవారు కూడా ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ప్రియదర్శి ఒకడు. ఇటీవల జరిగిన సినీ మహోత్సవంలో చిరంజీవితో కలిసి ఫోటో దిగిన ప్రియదర్శి దానిని తన ట్విటర్ ఖాతాలో పొందుపరిచాడు. “సదా మీ ఏకలవ్య శిష్యుడిని” అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు ఒక ఐయేఎస్ అధికారి స్పందిస్తూ.. “బ్రదర్ ప్రియదర్శి.. నేను చిరంజీవి ‘రుద్రవీణ’ చూసి ఐయేఎస్ అధికారి కావాలనుకున్నాను. మీరు కూడా మంచి నటుడని మల్లేశం సినిమాతో నిరూపించుకున్నారు. శుభాభినందనలు. కానీ, చిరంజీవిని పొగడకుండా సినీ ఫీల్డ్‌లో ఉండడం కష్టమా బ్రదర్…” అని ప్రశ్నించారు. దీనికి ప్రియదర్శి స్పందిస్తూ.. “ధన్యవాదాలు సర్! చిరంజీవిగారి సినిమాలు స్పష్టమైన విలువలతో ఉంటూ, జీవితంలో పైకి ఎదగాలనే స్ఫూర్తిని మనలో నింపుతాయి” అని ట్వీట్ చేశాడు

Related posts