telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సైఫ్ అలీఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్…!

saif ali khan busy with his son viral

సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై నెటిజన్లు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సైఫ్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సైఫ్ అలీఖాన్ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బాలీవుడ్‌లో నెపోటిజం కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇక సుశాంత్‌ను తాను ఎంతగానో ప్రోత్సహించినట్టు చెప్పారు. ఆయనతో కలిసి ‘దిల్ బేచారా’ సినిమాలో కలిసి నటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు తన కూతురు సారా అలీ ఖాన్ మొదటి చిత్రం కూడా సుశాంత్ సింగ్‌తో ‘కేదార్‌నాథ్’ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించాడు. కాగా సైఫ్ అలీ ఖాన్ నెపోటిజం పై చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయన వ్యాఖ్య దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Related posts