telugu navyamedia
సినిమా వార్తలు

ఆమెను నాలుగడుగులన్నా స్వేచ్ఛగా వేయనీ… ఐశ్వర్యారాయ్ పై నెటిజన్ల ట్రోలింగ్ 

Ishwarya-Rai
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ తన గారాలపట్టి ఆరాధ్యను ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అదే అతి అయ్యిందంటూ ఇప్పుడు ఐశ్వర్యను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. రెండు రోజుల క్రితం ఐశ్వర్య, అభిషేక్, ఆరాధ్య, జయా బచ్చన్ లు బీకేసీలోని ఓ రెస్టారెంట్ లో డిన్నర్ చేశారు. ఆపై వారు బయటకు వస్తుంటే కెమెరాలు క్లిక్ మన్నాయి. అంతవరకూ బాగానే ఉంది. ఆ ఫోటోలు బయటకు వచ్చిన తరువాత ఐష్, తన కుమార్తె చేతిని పట్టుకున్న విధానాన్ని చూసి, నెటిజన్లు పలు నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. “దయచేసి ఆరాధ్య చేయి వదులుతావా ఐశ్వర్యా” అని ఒకరు, అంతే కాదు “దయచేసి ఆరాధ్యను వదులు. ఆమెను నాలుగడుగులన్నా స్వేచ్ఛగా వేయనీ” అని, “ఆరాధ్య ఏమీ మూడేళ్ల బిడ్డ కాదు చెయ్యి పట్టి నడిపించడానికి” అంటూ రకరకాలుగా ఐశ్వర్యను ట్రోల్ చేస్తున్నారు. 

Related posts