telugu navyamedia
సినిమా వార్తలు

ప్రియాంక పిచ్చుక గూడు హెయిర్ స్టైల్… నెటిజన్స్ ట్రోలింగ్

Priyanka-Chopra

కొందరు టాలీవుడ్ తారలు తమ చేష్టలతో ప్రేక్షకులకు షాక్ ఇస్తుంటారు. ఇప్పుడు ప్రియాంక చోప్రా చేసిన ప‌ని అంద‌రికీ అతిగానే క‌న‌ప‌డుతుంది. అంతేకాదు ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మేట్ గ‌లా 2019 ఫ్యాష‌న్ షోలో భ‌ర్త నిక్ జోన‌స్‌తో ప్రియాంక సంద‌డి చేసింది. ఈ షోలో ప్రియాంక హెయిర్ స్టైల్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పిచ్చుక గూడుని త‌ల‌పించేలా ఉన్న ఆమె హెయిర్ స్టైల్ చూసి అంద‌రూ షాక్ అవుతున్నారు. ఇదేంటి ప్రియాంక ఇలా త‌యారైంది ? అని కొంద‌రు అనుకుంటుంటే.. కొంద‌రు ఏకంగా ప‌క్క‌న నిక్‌ లేకుంటే ప్రియాంకను అస‌లు గుర్తు ప‌ట్ట‌లేక‌పోయేవార‌మ‌ని సెటైర్లు వేస్తూ నెటిజ‌న్స్ ఆమె హెయిర్ స్టైల్‌ను ట్రోల్ చేస్తున్నారు.

Related posts