telugu navyamedia
సినిమా వార్తలు

వైరముత్తును పెళ్ళి చేసుకో… చిన్మయికి నెటిజన్ సలహా

Chinmai

గత కొన్నాళ్లక్రితం టాలీవుడ్ ను ఊపేసిన “మీటూ” ఉద్యమంలో భాగంగా సింగర్ చిన్మయి శ్రీపాద ప్రముఖ తమిళ గీత రచయిత వైరముత్తుపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ విషయంలో కొందరు చిన్మయికి మద్దతు పలకగా, మరికొందరు మాత్రం విమర్శలు చేశారు. చాలామంది ఇప్పటికీ ఆమెను విమర్శిస్తూనే ఉన్నారు.

తాజాగా ఓ నెటిజన్ “వైరముత్తు స‌మ‌స్య‌కు ఓ పరిష్కారం ఉంది. నువ్వు వైర‌ముత్తును పెళ్లి చేసుకో. కొన్ని రోజులుగా నువ్వు ఎంత పిచ్చిగా ప్ర‌వ‌ర్తిస్తున్నావో అర్థం కావ‌డం లేదు. స్టుపిడ్‌.. నీకేం ప‌ని లేదా. ఎప్పుడూ ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తుంటావు. నువ్వు బీజేపీ వ్య‌క్తివ‌ని తెలుసు” అంటూ చిన్మ‌యిని విమ‌ర్శించాడు. ఈ విమర్శపై స్పందించిన చిన్మయి “మీ ఐడియా బాగుంది… కానీ నాకు ఆసక్తి లేదు” అంటూ సమాధానం చెప్పింది. కానీ చిన్మయి ఏమాత్రం తగ్గకుండా సందర్భం వచ్చిన ప్రతిసారీ అతడిపై విరుచుకుపడింది. తాజాగా వైరముత్తుపై చిన్మయి చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల చిన్మయి “వైరముత్తు కనిపిస్తే ఈసారి కచ్చితంగా చెంప చెల్లుమనిపిస్తా.. అలా అయితేనే నాకు న్యాయం జరుగుతుందేమో” అంటూ కామెంట్ చేసింది.

Related posts