telugu navyamedia
news telugu cinema news trending

మీకు తెలుసా… నేడు, రేపు నెట్‌ఫ్లిక్స్ అంతా ఫ్రీ…

నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్‌ను కొన్ని రోజుల క్రితం నుంచి ప్రచారం చేస్తోంది ఆ సంస్థ. అయితే ఆరోజులు రానే వచ్చేవాయి. డిసెంబరు 5,6 తేదీలు భారత దేశమంతటా ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌ను వినియోగించుకోవచ్చు. ఈ రెండు రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ను ఉచితంగా స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. ఈ వార్త వచ్చిన మొదట్లో ఎప్పుడా అని అందరు అనుకున్నారు. ఆ సమయం ఆసన్నమైంది. ఈ వార్తతో సినిమా ప్రేమికులకు పెద్ద గుడ్ న్యూస్‌అనే చెప్పాలి. రెండు రోజులపాటు నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ అంటే చిన్న విషయం కాదు మరి. అయితే దీనికి కారణం ఈ రెండు రోజులపాటు ఈ ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మన దేశంలో స్ట్రీమ్ ఫెస్ట్‌ను నిర్వహించనుంది. అందులో భాగంగా ఈ రెండు రోజులు అందరు ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌ను స్ట్రీమ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ఆఫర్‌ను మొదటగా మనదేశంలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రపంచంలో ఏ ఇతర దేశంలోనూ ఈ సంస్థ ఇటువంటి ప్రయోగాన్ని చేయలేదు. నెట్‌ఫ్లిక్స్ చరిత్రలో ఇదే మొదటిసారి అందులోనూ ఈ ప్రయోగాన్ని భారత్‌లో నిర్వహిస్తోంది. మన దేశంలో అందరూ ఈ రెండు రోజుల పాటు ఎటువంటి అంతరాయం లేకుండా నెట్‌ఫ్లిక్స్ సేవలను వినియోగించుకుంటే ప్రయేగం సక్సెస్ అనె చెప్పాలి. ఒక్కసారి ఈ ప్రయోగం విజయవంతం అయితే ఇక నెట్‌ఫ్లిక్స్ ఇటువంటి మరిన్ని ప్రయోగాలను ప్రపంచ దేశాలలో చేసేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ ఆఫర్ వాడుకునేందుకు ఎటువంటి డెబిట్, క్రెడిట్ కార్డులతో పనిలేదు. కేవలం మీ ఈ-మెయిల్ ఉంటే సరిపోతుంది.

Related posts

తెలిసే కోమటిరెడ్డి నాటకాలు ఆడుతున్నారు: గుత్తా సుఖేందర్ రెడ్డి

vimala p

కేటీఆర్ కు టాలీవుడ్ ప్రముఖుల బర్త్ డే విషెస్

vimala p

పోస్ట్ ప్రొడక్షన్స్ కు గ్రీన్ సిగ్నల్…!

vimala p