telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

👫 నేస్తం 👫

devadasu poetry corner

చిరునవ్వులు వెల్లువలై
ప్రవహిస్తున్నాయి
ఒకపరి మునకలేద్దామా నేస్తం

కల్మషమెరుగని కోయిల
సత్యరాగం అందుకుంది
అందులో స్వరం కలుపుదామా నేస్తం

విజ్ఞానం మన ముంగిట
కల్పవృక్షమై పెరిగింది
విజ్ఞతనే నీరు పోసి
పోషిద్దామా నేస్తం

కష్ట సుఖాలు కలసి
వడి వడిగా వెళుతున్నాయి
వాటి అడుగుల్ని మనం
అనుసరిద్దామా నేస్తం

ఓర్పును సమానంగా పంచుకొని
ఓదార్పు దారిలో
నేర్పుగా పయనిద్దామా నేస్తం

చదువులమ్మ ఒడిలో
అక్షరాలాట ఆడుతూ
సులక్షణమైన సంస్కారాన్ని
గెలిచేద్దామా నేస్తం

సాదకబాధల్ని కుడి భుజాలపై
చెరిసగం మోస్తూ
స్వేచ్ఛగా కదులుదామా నేస్తం

హృదయపుటంచుల్లో ఉదయించే
కిరణాలమై లోకానికి
స్పూర్తి రేఖలవుదామా నేస్తం

చేయి చేయి కలిపి
చెలమలో చెలిమి తామరులై
ఉన్నతంగా వికసిస్తూ
మంచి పరిమళాల్ని
వెదజల్లుదామా నేస్తం

ఒకరికొకరమై
అందరివారమై
స్నేహ జీవులమై
జీవిద్దామా నేస్తం
••••••••○••••••••

రచన: నరెద్దుల రాజారెడ్డి

Related posts