సినిమా వార్తలు

"నేల టిక్కెట్టు" విడుదల అప్పుడే…!

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ, మాళవిక శర్మ జంటగా నటిస్తున్న చిత్రం “నేల టిక్కెట్టు”. మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు. మే 25న “నేల టిక్కెట్టు” చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించామని తెలిపారు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ చూసిన ప్రేక్షకులు సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం ఆడియోను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. “నేల టిక్కెట్టు” చిత్రం కోసం కొత్త మోడల్ మాళవిక శర్మను హీరోయిన్ గా తీసుకున్నారు.

Malvika Sharma

అయితే మాళవిక శర్మకు తెలుగులో ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. “నెల టిక్కెట్టు” ఆడియో వేడుకలో తళుక్కున మెరిసి అందరి దృష్టినీ తనవైపుకు తిప్పేసుకుందీ భామ.

రవితేజ నటించిన “రాజా ది గ్రేట్” చిత్రం భారీ విజయాన్ని సాధించింది. కానీ ఆ తరువాత రవితేజ నటించిన “టచ్ చేసి చూడు” చిత్రం పరాజయం పాలై ప్రేక్షకుల మన్ననలు పొందలేకపోయింది. అయినా కూడా రవితేజ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. మరి రవితేజ మాస్, మసాలాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందేమో చూడాలంటే విడుదల దాకా వేచి చూడాల్సిందే.

Related posts

మళ్ళీ సుకుమార్ దర్శకత్వంలో….

admin

4న కృష్ణవంశీ "నక్షత్ర" దర్శనం

admin

ఆమని ప్రధాన పాత్రలో ‘అమ్మదీవెన’ ప్రారంభం…

chandra sekkhar

Leave a Comment