నిన్ను విడిచి
నిన్ను మరిచి
నీకు దూరం అవ్వాలని
ఎన్నో సార్లు ప్రయత్నించి
విఫల మయ్యాను
నిన్ను గెలవాలన్న
ప్రతిసారి ఓటమి ఎదురయ్యెను
నీ హృదయంలో ప్రేమ
ఆప్యాయతలు.
నీ చూపులలో అనురాగం
స్వచ్ఛత గల మనసు
పదే పదే నీ జ్ఞాపకాలు
వీడకున్నవి..
నీ హృదయంలో స్థానం పొందాలని ఆశ పడ్డాను
నా ఆశ నిరాశగా మిగిలిపోయింది
నిదురలో కూడా
నీ తలంపులే
నా కనులు మూసిన ప్రతి సారి
నీ రూపం ఎదురుగ
నిలబడితే నిదుర రాని
రాత్రులు ఎన్నో
నీ జ్ఞాపకాలతో గడిపేస్తున్నాను..
నీకు దూరమై బ్రతకాలి అంటే
మరణానికి దగ్గరై నట్లే
కన్నీటి కడలిలో సాగిపోవుచున్నది
నా జీవితం..
గంజి ప్రియలత
దుబాయ్