telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

నష్టాలలో ముగిసిన … స్టాక్ మార్కెట్లు..

husge loses again in stock markets

నేటి మార్కెట్లు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఐటిరంగం కంపెనీలషేర్లు దిగజారడంతో ప్రతికూలంగానే ముగిసాయి. చివరినిమిషంలో ఈ రెండు రంగాల కంపెనీలు మార్కెట్లపై ఎక్కువ ఒత్తిడిని తెచ్చాయి. ఎస్‌అండ్‌పి బిఎస్‌ఇ సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 39,461 స్థాయికి దిగజారితే నిఫ్టీ 50 కూడా 11,817 పాయింట్లవద్దకు నిలిచింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లు ఎక్కువ దిగజారాయి. బ్యాంకింగ్‌రంగంతోపాటూ ఆటోమొబైల్‌ రంగషేర్లు కూడా ఒత్తిడినిపెంచాయి. వీటితోపాటు అంతర్జాతీయ మార్కెట్ల దోరణులు, రిటైల్‌ ద్రవ్యోల్బణం వంటివికూడా ట్రేడింగ్‌ తిరోగమనానికి కొంతకారణం అయ్యాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 15 పాయింట్లు దిగువన 39,741 పాయింట్లవద్ద ముగిసింది.

కొన్ని బ్లూచిప్‌కంపెనీలు ఇండస్‌ ఇండ్‌బ్యాంకు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎస్‌బ్యాంకు, ఇన్ఫోసిస్‌ల కంపెనీలు ప్రభావితం చేశాయి. పవర్‌గ్రిడ్‌ ఎంఅండ్‌ఎం కంపెనీలు ఎక్కువ లాభాల్లో ముగిశాయి. ఎస్‌బ్యాంకు, ఇండస్‌ఇండ్‌బ్యాంకు మొత్తంగా దిగజారింది. నిఫ్టీ50సూచీ ప్రామాణికస్థాయి 11,900 నుంచి 11,914కు చేరగలిగింది. అతిస్వల్పంగా అంటే ఎనిమిది పాయింట్లు మాత్రమే పెరిగింది. వివిధ విభాగసూచీల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు, మెటల్స్‌, ఐటి రంగ స్టాక్స్‌ ఎక్కువ నష్టపోయినట్లు తేలింది. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 39,461 స్థాయిని చేరింది. నిఫ్టీ కూడా 11,817పాయింట్లవద్ద కదలాడింది. పరిమితంగా మాత్రమే రికవరీ కనిపించింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌ సూచీలు 49 పాయింట్లు దిగువనముగిస్తే స్మాల్‌క్యాప్‌సూచీ 72 పాయింట్లు నష్టపోయింది. 14,476 స్థాయివద్ద నిలిచింది. ఇక ప్రభుత్వరంగ బ్యాంకులకు రానిబాకీల సమస్యలు పెరిగిపోయాయని యుబిఎస్‌ రేటింగ్‌ సంస్థ వెల్లడించింది.

Related posts