telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

పెళ్లి వద్దు.. ఒంటరిగానే ముద్దంటున్న .. అమ్మాయిలు..

course should pass before marriage is a rule

ఇటీవల పెళ్లి మాట ఎత్తితే చాలు అప్పుడే పెళ్లేంటని అమ్మాయిలు తల్లిదండ్రులను, శ్రేయోభిలాషులను తిరిగి ప్రశ్నిస్తున్నారు. చాలా మంది అమ్మాయిలు పెళ్లంటే నూరేళ్ల పంట కాదు జీవితాంతం మంట అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి పెద్దలు వీరికి సంబంధాలు చూస్తున్నా వీరు ఏవేవో కారణాలు చెప్పి పెళ్లికి దూరంగా ఉంటూ వస్తున్నారు. మరికొంతమంది జీవితాంతం పెళ్లే వద్దంటూ ఒంటరిగా మిగిలిపోతున్నారు. నెల్లూరుకు చెందిన వెన్నెల బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తోంది. పెళ్లీడుకొచ్చింది కదా అని సంబంధాలు వెతుకుతామని చెబితే ఇంకా ఎక్కువ సాలరీ రావాలని అప్పుడే పెళ్లి చేసుకుంటానని పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చింది. వెన్నెల సమాధానాలతో విసిగి వేసారిన ఆమె తల్లిదండ్రులు ఆమె చెల్లెలికి పెళ్లి చేశారు. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఇదే విధంగా ఉన్నారు.

కర్నూలు జిల్లాకు చెందిన యశ్వంత్ చదువు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కదా అని అతని తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. పెళ్లి చేస్తే తరువాత ఫ్రీడం ఉండదని తనకు ఇప్పుడే పెళ్లి వద్దని యశ్వంత్ చెప్పడంతో షాక్ అవ్వడం అతని తల్లిదండ్రుల వంతయింది. చాలామంది పెళ్లిళ్లు త్వరగా చేసుకోకపోవటానికి మనసు పొరల్లో దాగిన అనేక అనుమానాలే కారణమని సైకాలజిస్టులు చెబుతున్నారు. సామాజిక పరిచయం లేకపోవడం, కేవలం చదువుకే పరిమితం కావడం, ఓపెన్ నెస్ లేకపోవడంతో చాలామంది పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారని సర్వేల్లో వెల్లడైంది. అమ్మాయిలు తమ కంటే ఎక్కువ సంపాదించే వ్యక్తి కావాలని కోరుకోవడం వలన పెళ్లికూతురు తల్లిదండ్రులకు పెళ్లి కొడుకు వేటలో సంవత్సరాలు గడుస్తున్నాయి. అబ్బాయిల్లో చాలామంది జీవితంలో స్థిరపడే దాకా పెళ్లి వద్దని వాయిదా వేస్తూ వస్తున్నారు. మొత్తానికి అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లంటే అదేదో బందిఖానాగా భావిస్తున్నారు.

Related posts