telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్జీకే లో .. సాయి పల్లవి పై .. విమర్శలు.. సూట్ కాలేదట..

negative troll on saipallavi cast in ngk movie

నటిగా హీరోయిన్ సాయి పల్లవి టాలీవుడ్ హీరోయిన్స్ లో ఆకట్టుకునే డాన్స్ మరియు నటనతో యూత్ లో మంచి క్రేజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఫిదా సినిమాలో ఆమె నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నిజానికి ఆ సినిమా విజయంలో సాయి పల్లవి పాత్ర కూడా చాలా ఉందనేది సినీ విశ్లేషకులు సహా ప్రేక్షకులు కూడా చెప్తుంటారు. ఇకపోతే ప్రస్తుతం సాయి పల్లవి, సూర్య తో కలిసి నటించిన ఎన్జీకే సినిమా విషయమై ఆమె ఫ్యాన్స్ కొంత మధన పడుతూన్నట్లు సమాచారం. ఎందుకంటే ఆ సినిమాలో సూర్య భార్యగా సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో నటించిన సాయి పల్లవి, తెరపై తన అందం విషయమై తగు జాగ్రత్తలు కూడా సరిగా తీసుకోలేదనేది కొందరు చెపుతున్న మాట. కొన్ని సన్నివేశాల్లో ఆమె వేసుకున్న మేకప్ అంతగా బాలేదని, అంతేకాక మంచి బ్యూటిఫుల్ బబ్లీ పాత్రలు చేసే సాయి పల్లవికి, అటువంటి ఇల్లాలి పాత్ర సెట్ కాలేదని కూడా అంటున్నారు.

నిజానికి తాను చేసిన ఆ పాత్రకు ఆమె పూర్తి స్థాయిలో న్యాయం చేసినప్పటికి, అది ఆమె చేయవలసిన పాత్ర మాత్రం కాదంటున్నారు. ఇకపోతే దాదాపుగా అటు తమిళనాడు, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు సహా అన్ని చోట్ల నుండి నెగటివ్ టాక్ సంపాదించిన ఈ సినిమా కలెక్షన్లు కూడా కొంత తగ్గు ముఖం పట్టాయని, రాబోయే రోజుల్లో ఈ సినిమా సూర్య కెరీర్ లో మరొక అపజయంగా మిగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అయితే ఏమాత్రం పెద్దగా ప్రాధాన్యం లేని ఇటువంటి6 పాత్రను సాయి పల్లవి ఎలా ఒప్పుకుందో తమకు అర్ధం కావడం లేదని, అలానే ఇటీవల ఆమె శర్వానంద్ తో కలిసి నటించిన పడి పడి లేచే మనసు సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆమె చేసిన పాత్ర చాలా బాగుందని, కాబట్టి రాబోయే రోజుల్లో ఆమె అటువంటి పాత్రల్లో నటిస్తే బాగుంటుందని ఆమె అభిమానులు కొందరు సోషల్ మీడియా వేదికల్లో తమ అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts