telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

మరికొన్ని గంటల్లో నీట్..పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

exam hall neet

నీట్ (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. దేశ వ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షలను ఈసారి కరోనా వ్యాప్తి మధ్య నిర్వహిస్తుండడంతో ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఆయా పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

నీట్‌కు దేశవ్యాప్తంగా 15.97 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 55,800 తెలంగాణ విద్యార్థులు నీట్ రాయబోతున్నారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలలో మొత్తం 112 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి 4 గంటల వరకు ఆఫ్‌లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి మాస్కు ధరించి, శానిటైజర్ పట్టుకుని కేంద్రానికి రావాల్సి ఉంటుంది. అక్కడ మళ్లీ ఒక్కో విద్యార్థికి మూడు పొరలున్న మాస్కును అధికారులు అందజేస్తారు. పరీక్ష రాసే విద్యార్థులు చేతులకు గ్లౌజులు ధరించొచ్చు. పారదర్శకంగా ఉండే నీళ్ల బాటిల్‌ను కూడా వెంట తెచ్చుకోవచ్చు. హాల్ టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డు తప్పనిసరని అధికారులు తెలిపారు. మొబైల్ ఫోన్లు, పెన్నులు, చేతి గడియారాలు, బంగారు ఆభరణాలను అనుమతించరు.

Related posts