telugu navyamedia
విద్యా వార్తలు

రేపే నీట్ ఎగ్జామ్‌..నీబంధ‌న‌లు ఇవే..

దేశ వ్యాప్తంగా రేపు నీట్ ఎగ్జామ్‌ను నిర్వ‌హించ‌నున్నారు. సుమారు 16 ల‌క్ష‌ల మంది ఈ ఎగ్జామ్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. తెలంగాణ‌, ఏపీ నుంచి ల‌క్ష మంది హాజరు కానున్నారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. దేశ వ్యాప్తంగా 202 ప‌ట్ట‌ణాల్లో 3,842 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ‌లోని 7 ప‌ట్ట‌ణాల్లో 112 కేంద్రాల్లో, ఏపీలో 9 ప‌ట్ట‌ణాల్లో 151 కేంద్రాల్లో స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాయనున్నారు.

Statewide NEET Ranks Released - Sakshi

పరీక్ష రాసే ప్రతి విద్యార్థి..హెల్త్‌ స్టేటస్, ట్రావెల్‌ హిస్టరీతో..సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫామ్ తీసుకురావాల్సి ఉంటుంది. ఏ4 సైజ్‌ పేపర్‌ ప్రింట్‌ సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫామ్‌ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్‌ ఫామ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఫొటో, ఐడీ ప్రూఫ్, అడ్మిట్ కార్డు, తప్పనిసరి అని తెలిపింది. పెన్ను, పేప‌ర్ విధానంలోనే ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్నారు.

ప్ర‌తి విద్యార్థి త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాలి. హ్యాండ్‌ శానిటైజర్‌, ట్రాన్స్‌పరెంట్‌ వాటర్‌ బాటిల్‌, మాస్క్‌, గ్లోవ్స్‌ తీసుకెళ్లాలి. ఇక హ్యాండ్‌ బ్యాగ్స్‌, జ్యువెలరీ, హ్యాట్‌, స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌ వాచ్‌లతో పాటు ఇతర వ్యక్తిగత వస్తువులేవీ తీసుకెళ్లకూడదు. అనుమ‌తి లేద‌ని ఎన్టీఏ అధికారులు స్ప‌ష్టం చేశారు.

JEE Main 2021: జేఈఈ మెయిన్ మార్చి సెషన్ రిజిస్ట్రేషన్ కు రేపే లాస్ట్ డేట్.. పూర్తి వివరాలివే..

కాగా..ఇక గంటన్నర ముందే ఎగ్జామ్‌ సెంటర్‌కు చేరుకోవాలని, నిమిషం ఆల‌స్య‌మైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమ‌తించ‌రు. వారిని నిబంధనల ప్రకారం తనిఖీ చేశాకే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు.

NEET 2021: రేపే నీట్ ఎగ్జామ్ - నిమిషం ఆల‌స్య‌మైనా నో ఎంట్రీ : అభ్యర్ధులకు కీలక సూచనలు..!! | preparations made for NEET exam following covid protocol - Telugu Oneindia

Related posts