telugu navyamedia
క్రీడలు రాజకీయ

నీరజ్ స్వర్ణం వెనుక ఇంత‌ శ్రమ ..!

 

నీరజ్‌ చోప్రా.. పెద్దగా పరిచయం అవసరంలేని పేరు, నీరజ్ చోప్రాకి దేశం మొత్తం సెల్యూట్ చేస్తోంది . చరిత్ర తిరగ రాసి.. వందేళ్ల ఎదురు చూపులకు ఫలితాన్ని అందించాడు మన గోల్డెన్ చోప్రా. 23 ఏళ్ల నీరజ్.. జావెలిన్ చేతబట్టి పరుగెడుతుంటే.. ప్రత్యర్ధుల గుండెల్లో వణుకుపుట్టింది. ఏకంగా 87 మీటర్లు విసిరి త‌న స‌త్తా ఎంటో చాటాడు.

Tokyo Olympics 2020: Neeraj Chopra wins historic Gold in javelin throw,  India's first athletics medal in 100 yrs - The Economic Times Video | ET Now

టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌ విభాగంలో స్వర్ణం సాధించ‌డానికి దాని వెనుక చాలా క‌ష్టం ముంద‌ని ఈ విడియో చూస్తే తెలుస్తోంది 23 ఏళ్ల యువ అథ్లెట్ వీడియో సామాజిక మాద్యమాలలో తెగ వైరల్ అవుతుంది. బంగారు పథకం సాధించటానికి నీరజ్‌ చోప్రా పడిన కష్టం అంతా ఇంతా కాదు.. ఒక్కరోజులోనో, ఒక నెలలో చేసిన సాధన కాదు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ వలన సాధ్యమైన ఒక ప్రదర్శన అని అంటున్నారు.

Neeraj Chopra: From chubby kid trying to lose weight to Olympic gold winner

 

 

కాగా..ఇండియన్ క్రికెటర్ మహ్మద్ కైఫ్‌ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నీరజ్‌ పడిన కష్టానికి, తను చేసిన శ్రమకు అద్దం పడుతుంది. నీరజ్ చోప్రా సాధన చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది, నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు..దేశానికి ఇంత కీర్తి ప‌తాకం తెచ్చిపెట్టిన నీరజ్ చోప్రాను దేశం అభినందిస్తోంది.

Related posts