telugu navyamedia
క్రీడలు

మ‌రోసారి చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రా..

టోక్యో ఒలింపిక్‌ పతక విజేత, భారత స్టార్‌ జావెలిన్‌ త్రోవర్‌ నీరజ్‌ చోప్రా మరోసారి  అరుదైన ఘనతను సాధించాడు.  స్విట్జర్లాండ్‌లోని సుసానెలో జరిగిన డైమండ్‌ లీగ్‌ అథ్లెటిక్స్‌లో స్వర్ణం పతకం సాధించాడు. దీంతో డైమండ్‌ లీగ్‌లో టైటిల్‌ సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా ఘనత సాధించాడు.

శుక్రవారం(ఆగస్టు 26న) జరిగిన అర్హత రౌండ్‌లో తొలి ప్రయత్నంలోనే నీరజ్‌ ఈటెను 89.08 మీట్లర్ల దూరం విసిరి అందరికంటే ముందంజలో నిలిచాడు

ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 85.18 మీటర్లు, మూడో ప్రయత్నంలో ఈటెను విసరలేదు. నాలుగో ప్రయత్నంలో ఫౌల్‌ చేసిన నీరజ్‌ చివరి ప్రయత్నంలో 80.04 మీటర్లు మాత్రమే విసరగలిగాడు. అయితే తనకంటే బెస్ట్‌ ఎవరు వేయకపోవడంతో నీరజ్‌ తొలి స్థానంలో నిలిచి గోల్డ్‌ మెడల్‌ సొంతం చేసుకున్నారు

దీంతో సెప్టెంబర్‌ 7, 8 తేదీల్లో జరుగనున్న జ్యూరిచ్‌ డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించాడు. అంతేకాదు వచ్చేఏడాది బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌ బెర్తును కూడా ఖరారు చేసుకున్నాడు.

కాగా..గత నెలలో అమెరికాలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో నీరజ్‌ రజతం సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్‌ సందర్భంగా గాయపడటంతో నీరజ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి వైదొలిగాడు.

Related posts