telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

మొటిమెల కు … ప్రకృతి చికిత్సతో చెక్…

neem leaves benefits in rain season

మొటిమెలు సాధారణంగా యవ్వనంలో అందరిని పలకరిస్తూనే ఉంటాయి. అయితే అవి వచ్చినప్పుడు ఆయా వ్యక్తులు అందానికి అడ్డుగా భవిస్తూ ఇబ్బందిగా భావిస్తారు. ఆయా వయసులో వీటి ప్రభావం సాధారణం అయినప్పటికీ వాటి నుండి దూరంగా ఉండేందుకు కూడా చిట్కాలు లేకపోలేదు. అవేమితో చూద్దాం.. యువతులను , మహిళలను బాగా ఇబ్బంది పెట్టే సమస్య ఇది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వీటిని అరికట్టడం కొందరికి సాధ్యం కాకపోవచ్చు .. అలాంటి వారికి సింపుల్ చిట్కా .. అందులోనూ అది మన ఇళ్లలో దొరికే వాటితోనే .. మొటిమలకి వేపాకు మంచి మందు అంటున్నారు సౌందర్యనిపుణులు. ఇందులోని ఔషధ గుణాలు అటు జిడ్డు చర్మం నుంచి నూనె కారకుండా చేస్తాయి.

వేపలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు రాకుండా చేస్తాయి. అలాగే ఇందులో సమృద్ధిగా ఉన్న విటమిన్ – ఇ, ఫ్యాటీ ఆమ్లాలు పొడి చర్మాన్ని మృదువుగానూ తేమగానూ ఉంచుతాయి. కాబట్టి వేపాకు అన్ని రకాల చర్మానికి మంచిదే. వేపాకుని బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి చల్లారనివ్వాలి. తరవాత ఆ నీటిలో గంధం పొడిని కలిపి ముద్దలా చేసి ముఖానికి మెడకీ పట్టించి పావుగంట సేపు ఉంచి కడిగేయాలి. అన్ని రకాల చర్మానికి పనిచేసే ఈ మాస్క్ వల్ల ముఖం మీద మొటిమలు క్రమంగా తగ్గి, అది క్రమంగా మెరుపుని సంతరించుకుంటుంది. ప్రకృతి సిద్దమైన పద్దతి కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

Related posts