telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ తోలి సాంగ్ రిలీజ్

Uppena

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన’ సినిమా ద్వారా ఈయన వెండితెరకు పరిచయమవుతున్నారు. సుకుమార్ దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్.  దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమా నుంచి తొలి పాటను సోమవారం విడుదల చేశారు. పాట చాలా బాగుంది. దేవీ గజల్స్‌ను మిక్స్ చేసి కొట్టారు. ఈ పాటలో హిందీని కూడా మిక్స్ చేశారు. హిందీ సాహిత్యంతోనే పాట మొదలైంది. ఈ హిందీ సాహిత్యాన్ని రకీబ్ ఆలమ్ రచించారు. ఇక తెలుగు సాహిత్యాన్ని శ్రీమణి అందించారు. హిందీ వోకల్స్‌ను శ్రీకాంత్ చంద్ర ఆలపించగా.. పాటను జావేద్ అలీ పాడారు. ‘నీ కన్ను నీలి సముద్రం.. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం.. నీ నవ్వు ముత్యాల హారం.. నన్ను తీరానికి లాగేటి దారం దారం.. అంటూ సాగే లిరిక్స్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతాయి. ముఖ్యంగా హీరోయిన్ కృతి శెట్టి సహజమైన అందానికి యూత్ కచ్చితంగా కనెక్ట్ అయిపోతారు.

Related posts