telugu navyamedia
సినిమా వార్తలు

బాలయ్య 105వ సినిమా ప్రారంభం

Balakrishna

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.కళ్యాణ్ నిర్మాత‌గా కొత్త చిత్రం గురువారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ హిట్ కాంబినేష‌న్‌లో ఇది వ‌ర‌కు “జైసింహా” వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత రూపొందుతున్న చిత్ర‌మిది. ఈ కార్య‌క్ర‌మంలో ముహూర్త‌పు స‌న్నివేశానికి వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా, బోయ‌పాటి శ్రీను కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. కోదండ రామిరెడ్డి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జూలై నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి ప‌రుచూరి ముర‌ళి క‌థ‌ను అందిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తుండ‌గా రామ్‌ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. రామ్‌లక్ష్మ‌ణ్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. చిన్నా ఆర్ట్ వ‌ర్క్‌ను అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాల‌ను తెలియజేయనున్నారు.

Related posts