telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యాంకర్ గా నయనతార… సినిమాల్లోకి రాకముందే ఎలా ఉందో చూశారా ?

nayanatara agreed to promote syeraa

లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తారకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తుంటే మ‌తిభ్ర‌మించ‌క త‌ప్ప‌దు. ప‌లు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసిన ఈ అమ్మ‌డు హీరోల‌కి స‌మానంగా ఫాలోయింగ్ పెంచుకుంది. త్వ‌ర‌లో ద‌ర్భార్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. చంద్రముఖి సినిమాతో సిల్వర్‌స్క్రీన్‌పై మెరిసింది నయనతార. తొలి సినిమాతోనే సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించే అరుదైన అవకాశం కొట్టేసి..ఎంతోమంది అభిమానులను సంపాదించింది. తెలుగు, తమిళంలో దాదాపు అగ్రహీరోలందరితో నటించి టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. మహిళా ప్రధాన చిత్రాలతో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు కూడా తెచ్చుకుంది ఈ భామ. నయనతార నటిగా కెరీర్ ప్రారంభించడానికి ముందు మలయాళం టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా పని చేసింది. ఛానల్ షోలో యాంకర్‌గా..తన పేరు డయాన మరియమ్ కురియన్, మళ్లీ షో టైం వరకు వెయిట్ చేయండి అంటూ చెప్పిన వీడియో ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్లు, అభిమానులు అసలు మనం చూస్తున్నది నయనతారేనా అని ముక్కున వేలేసుకున్నారట. మరికొంతమంది నయనతార ైస్టెల్ ఏం మారలేదని, ఆమె గొంతు చాలా బాగుందని కామెంట్లు పెడుతున్నారు.

Related posts