telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కమల్ హాసన్ తో జోడి కట్టనున్న నయనతార

సినీ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నయనతార. కాగా అప్పట్లో కమల్ హాసన్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘రాఘవన్’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2006లో విడుదలై తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. కాగా దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుష్క నటించబోతుందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా సినీ వర్గాలు సమాచారం ప్రకారం లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ చిత్ర షూటింగ్‌లో ఉన్నాడు. అయితే కరోనా వల్ల వాయిదా పడింది. ఆ సినిమా పూర్తయ్యాక ‘రాఘవన్ -2’ చిత్రాన్ని పట్టాలెక్కించనుంది చిత్రబృందం.

Related posts