telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘రాఘవన్ -2’ చిత్రంలో హీరోయిన్‌గా లేడీ సూపర్ స్టార్

nayanatara agreed to promote syeraa

లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది నయనతార. అందులో భాగంగా.. నయన్.. తమిళ్‌లో ‘అరం’, ‘డోరా’, ‘కోలమావు కోకిల’, ‘ఐరా’, ‘కొలైయుదిర్‌కాలం’ వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కాగా అప్పట్లో కమల్ హాసన్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘రాఘవన్’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2006లో విడుదలై తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. కాగా దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సినీ వర్గాలు సమాచారం ప్రకారం అనుష్క నటించబోతుందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ చిత్ర షూటింగ్‌లో ఉన్నాడు. అయితే కరోనా వల్ల వాయిదా పడింది. ఆ సినిమా పూర్తయ్యాక ‘రాఘవన్ -2’ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

Related posts