telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నయనతార పెళ్లి డేట్‌ ఫిక్స్‌ ?

నయనతార లేడీ రోల్‌ చాలా సినిమాలు తీసింది. దీంతో నయనతార ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. లేడి సూపర్‌ స్టార్‌గా నయన్‌ తన కెరీర్‌ను ఇంకా హై రేంజ్‌ తీసుకుంది.  అయితే.. తాజాగా నయనతార పెళ్లి విషయంపై  ఓ వార్త వైరల్ అవుతోంది.  అది ఏంటంటే.. విఘ్నేశ్ తో ఏడు అడుగులు వేయటానికి ముహూర్తం నిర్ణియించేసుకుందట లేడీ సూపర్ స్టార్. అదీ ఈ మార్చ్ లోనే మ్యారేజ్ అంటున్నారు చెన్నై సినిమా జనం. ఇంత దగ్గర్లో గ్రాండ్ ఈవెంట్ ఉంటే నయనతార, విఘ్నేశ్ ఎక్కడా ఏమీ మాట్లాడటం లేదనేదే కొందరి అనుమానం! వారి నుంచీ ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేదు. నయన్, విఘ్నేశ్ దగ్గరి వారు కూడా పెదవి విప్పటం లేదు. మరి అసలైన వారు సైలెంట్ గా ఉన్నా పుకార్లు ఎలా పుడుతున్నాయి? ఎవరెవరో చెబుతోన్న నయన్ వెడ్డింగ్ విషయాలు నిజమేనా? మరికొన్నాళ్లు ఆగాలి! కాకపోతే, ఈసారి కళ్యాణానికి కౌంట్ డౌన్ మొదలైపోయిందని మాత్రం గట్టిగానే ప్రచారం జరుగుతోంది మరి!

Related posts