telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“నా పిల్లలకు జన్మనివ్వబోయే తల్లి…” నయనతారపై విఘ్నేష్ కామెంట్స్

Nayan

నయనతార దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్. సినిమాలో ఒక పాత్ర ఇస్తే ఆ పాత్రకు ప్రాణం పోసే అద్భుత నటి. ఒకానొక సందర్భంలో హీరోను సైతం డామినేట్ చేసే సత్తా ఆమెది. నయనతార అటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు, ఇటు గ్లామర్ రోల్స్ తో దూసుకెళ్తోంది. మరోవైపు భారీ బడ్జెట్ సినిమాల్లోనూ నటిస్తూ భారీ క్రేజ్ ను మూటగట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అయితే నయనతార కొద్ది కాలంగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఇప్పటివరకు తమ బంధంపై బహిరంగంగా స్పందించలేదు. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంటారు. తాజాగా మదర్స్ డే సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో విఘ్నేష్ శివన్ చేసిన కామెంట్ హాట్ టాపిక్‌గా మారింది. ఓ పాపను ఎత్తుకున్న నయన్ ఫొటోను పోస్ట్ చేసి.. `నా పిల్లలకు జన్మనివ్వబోయే తల్లి చేతుల్లో ఉన్న పాప తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు` అని కామెంట్ చేశాడు. దీంతో విఘ్నేష్, నయన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ మరోసారి వార్తలు జోరందుకున్నాయి. అలాగే తన తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసిన విఘ్నేష్.. నయనతార తల్లికి కూడా విషెస్ చెప్పాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Related posts