telugu navyamedia
సినిమా వార్తలు

ఎన్ని కోట్లిచ్చినా అతడితో నటించను అంటున్న నయన్

Nayanatara

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకపక్క సీనియర్ టాప్ హీరోల పక్కన హీరోయిన్ గా చేస్తూ మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. చాలామంది నిర్మాతలలు నయనతార ఎంత పారితోషికం అడిగితే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారనే టాక్ నడుస్తోంది ఇండస్ట్రీలో. అయితే సినిమాల్లో కంటెంట్ ఉంటేనే నటించడానికి ఆసక్తి చూపిస్తుంది నయనతారా. అయితే ఈ విషయం తెలియక ఇటీవల అనుకోకుండా ఓ నిర్మాత సినిమా స్టోరీ ఏమీ చెప్పకుండా ముందుగా ఆమె తేదీలు తీసుకోవడానికి ఎలాగైనా ఆమెని ఒప్పించడానికి ప్రయత్నాలు చేయటంతో సదరు నిర్మాతకు నయన్ ఊహించని షాక్ ఇచ్చింది. చెన్నైలో శరవణ స్టోర్స్ అధినేతగా శరవణ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆయన సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. త్వరలో శరవణ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ చిత్రంలో హీరోయిన్ గా నటింపజేసేందుకు నిర్మాత వెళ్లి నయనతారని సంప్రదించాడట. శరవణ క్రేజ్ లేని నటుడు కాబట్టి ఆ నిర్మాత నయనతారకు 10 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడట. కానీ నయనతార మాత్రం ఎన్ని కోట్లిచ్చినా అతడి సరసన నటించానని తేల్చి చెప్పేసినట్లు సమాచారం. ప్రస్తుతం నయనతార సెన్సేషనల్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుండగా..మరోపక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేందర్ రెడ్డి దర్శకత్వం మెగాస్టార్ చిరంజీవి హీరోగా అతి పెద్ద భారీ ప్రాజెక్ట్ అయినా సైరా సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

Related posts