telugu navyamedia
news telugu cinema news trending

విఘ్నేష్ శివన్ .. నిర్మాణంలో .. నయన్ ..

nayanatara with vighnesh sivan

నయనతార ఇటు తెలుగు, అటు తమిళంలో వరుస సినిమాలతో పలకరిస్తున్న సంగతి తెలిసిందే. నయన్ నటించిన సైరా చిత్రం దసరా కానుకగా విడుదల కానుండగా, ఆమె ప్రస్తుతం తన 65వ చిత్రంతో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని తన ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మిస్తుండగా, మిలింద్ రవ్ తెరకెక్కిస్తున్నాడు. థ్రిల్లర్‌తో పాటు ఆసక్తికరంగా ఉండనున్న ఈ చిత్రానికి నెట్రికన్న్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్‌లో టైటిల్ బ్రెయిలీ లిపీతో రూపొందించినట్టుగా ఉంది.

చిత్రంలో నయనతార అంధురాలిగా కనిపించనున్నట్టు సమాచారం. చిత్రానికి సంబంధించిన పూర్తి డీటైల్స్ అతి త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ చిత్రంతో విఘ్నేష్ శివన్ నిర్మాతగా మారుతున్నాడు. కాగా నయన తార తమిళంలో రజనీకాంత్ దర్భార్, విజయ్ బిగిల్ చిత్రాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది నయన్, విఘ్నేష్ శివన్ పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు తెలుస్తుంది.

Related posts

బజరంగ్ పునియా.. ఆసియా రెజ్లింగ్‌ లో వరుసగా రెండో స్వర్ణం…

vimala p

విద్యార్థినిని వేధించిన యువకుడు.. దేహశుద్ది చేసిన విద్యార్థులు!

vimala p

విద్యా శాఖలోనూ .. మార్పులకు శ్రీకారం..

vimala p